పాత పెన్షన్ అమలు చేయాలి
ABN , First Publish Date - 2021-11-28T07:14:19+05:30 IST
పాత పెన్షన్ అమలు చేయాలి

ఆర్టీసీ చైర్మన్‌ను కోరిన ఎన్‌ఎంయూ నేతలు
అమరావతి, నవంబరు 27 (ఆంధ్రజ్యోతి): ‘‘ఈహెచ్‌ఎస్ ద్వారా వైద్యం అందక సిబ్బంది చాలా ఇబ్బంది పడుతున్నారు. వైద్య సౌకర్యాల కోసం రెఫరల్ ఆస్పత్రులను కొనసాగించాలి. ప్రభుత్వం పాత పెన్షన్ అమలు చేయాలి. పాలకమండలి సమావేశంలో వీటిపై తీర్మానం చేయండి’’ అంటూ ఏపీఎస్‌ఆర్టీసీ చైర్మన్ మల్లికార్జునరెడ్డిని ఎన్‌ఎంయూ రాష్ట్ర అధ్యక్షుడు పీవీ రమణారెడ్డి నేతృత్వంలోని బృందం కోరింది. ఆర్టీసీ పాలకమండలి ఏర్పాటయ్యాక డిసెంబరు 2న విజయవాడలో మొదటి సమావేశం జరగనుంది. ఈ నేపథ్యంలో పీటీడీ సిబ్బంది సమస్యలపై ఆర్టీసీ చైర్మన్‌తో ఎన్‌ఎంయూ ప్రతినిధి బృందం చర్చించింది. పాలక మండలి సమావేశంలో చర్చించి సాధ్యమైనంత వరకూ పరిష్కారానికి కృషి చేస్తామని ఆర్టీసీ చైర్మన్ హామీ ఇచ్చారని చెప్పారు. ఈ సమావేశంలో అసోసియేషన్ నాయకుడు శివారెడ్డి తదితరులు పాల్గొన్నారు.