మున్సిపల్‌ కమిషనర్‌ను బదిలీ చేయాలి

ABN , First Publish Date - 2021-12-08T08:43:45+05:30 IST

మున్సిపల్‌ కమిషనర్‌ను బదిలీ చేయాలి

మున్సిపల్‌ కమిషనర్‌ను బదిలీ చేయాలి

9న జిల్లా కలెక్టరేట్ల వద్ద నిరసనలు: ఏపీ వీఆర్వోల సంఘం

విజయవాడ సిటీ, డిసెంబరు 7 (ఆంధ్రజ్యోతి): శ్రీకాకుళం జిల్లా పలాసలో వీఆర్వోలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మున్సిపల్‌ కమిషనర్‌ను బదిలీ చేయాలని, మంత్రి సీదిరి అప్పలరాజు వ్యాఖ్యలు వెనక్కు తీసుకోవాలని, అప్పటి వరకు తమ ఉద్యమం కొనసాగుతుందని గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు భూపతిరాజు, ఎం.అప్పలనాయుడు స్పష్టంచేశారు. ఈ మేరకు మంగళవారం వారు ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ నెల 9న రాష్ట్రంలోని 13 జిల్లాల కలెక్టరేట్ల వద్ద భారీ ఎత్తున నిరసనలు చేపడుతున్నట్టు పేర్కొన్నారు. ఈ నెల 2 నుంచి నల్ల రిబ్బన్లతో తాహసీల్దార్‌ కార్యాలయాల వద్ద నిరసన కార్యక్రమాలు చేస్తూ.. గ్రామ సచివాలయాలకు వెళ్లకుండా తాహసీల్దార్‌ కార్యాలయాల్లోనే విధులు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. సంఘం రాష్ట్ర మాజీ అధ్యక్ష, కార్యదర్శులు ఆంజనేయకుమార్‌, సురే్‌షబాబు సంఘం పేరుతో పత్రికల్లో ప్రకటనలు ఇవ్వడాన్ని ఖండిస్తున్నామన్నారు.

Updated Date - 2021-12-08T08:43:45+05:30 IST