నిరాడంబరంగా గవర్నర్‌ దంపతుల వివాహ వార్షికోత్సవం

ABN , First Publish Date - 2021-07-08T08:56:17+05:30 IST

రాష్ట్ర గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ , సుప్రవ హరిచందన్‌ దంపతుల 56వ వివాహ వార్షికోత్సవ వేడుక నిరాడంబరంగా జరిగింది. రాజ్‌భవన్‌లో బుధవారం జరిగిన ఈ కార్యక్రమానికి అతిథులను, ఆహ్వానితులను

నిరాడంబరంగా గవర్నర్‌ దంపతుల వివాహ వార్షికోత్సవం

అమరావతి, జూలై 7, (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ , సుప్రవ హరిచందన్‌ దంపతుల 56వ వివాహ వార్షికోత్సవ వేడుక నిరాడంబరంగా జరిగింది. రాజ్‌భవన్‌లో బుధవారం జరిగిన ఈ కార్యక్రమానికి అతిథులను, ఆహ్వానితులను అంగీకరించలేదు. కేవలం రాజ్‌భవన్‌ ఉన్నతాధికారులు మాత్రమే గవర్నర్‌ దంపతులను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. గవర్నర్‌ కార్యదర్శి ముఖే్‌షకుమార్‌ మీనా, సంయుక్త కార్యదర్శి శ్యామ్‌ ప్రసాద్‌ తదితరులు గవర్నర్‌కు మొమెంటోను బహుకరించారు. అలనాటి వివాహ వేడుక జ్ఞాపకాలను ఈ సందర్భంగా గవర్నర్‌ దంపతులు గుర్తుచేసుకున్నారు. ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి, ఆయన సతీమణి భారతి గవర్నర్‌ దంపతులకు ఫోన్‌చేసి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. 


నేడు గవర్నర్‌ను కలవనున్న టీడీపీ ఎమ్మెల్యేలు

తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేల బృందం గురువారం గవర్నర్‌ విశ్వ భూషణ్‌ హరిచందన్‌ను కలవనుంది. వివిధ ప్రజా సమస్యలపై కలవడానికి సమయం కోరగా ఆయన ఇచ్చారని టీడీపీ వర్గాలు తెలిపాయి. రాజ్‌భవన్‌లో ఆయనను కలిసి వారు ఒక వినతి పత్రం అందచేయనున్నారు. 

Updated Date - 2021-07-08T08:56:17+05:30 IST