గవర్నర్‌ను కలిసిన ఎమ్మెల్సీలు తలశిల, లేళ్ల
ABN , First Publish Date - 2021-12-26T08:45:04+05:30 IST
గవర్నర్‌ను కలిసిన ఎమ్మెల్సీలు తలశిల, లేళ్ల

అమరావతి, డిసెంబరు 25(ఆంధ్రజ్యోతి): కొత్తగా శాసన మండలి సభ్యులుగా బాధ్యతలు తీసుకున్న తలశిల రఘురామ్, లేళ్ల అప్పిరెడ్డి గవర్నర్ విశ్వ భూషణ్ హరిచందన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. శనివారం రాజ్‌భవన్‌కు వెళ్లిన ఎమ్మెల్సీలు గవర్నర్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ప్రజాసేవే పరమావధిగా ముందుకు సాగాలని ఆయన ఆకాంక్షించారు. శాసన వ్యవస్థలో క్రియాశీలక పాత్ర పోషించే శాసన పరిషత్తుకు వన్నె తీసుకురావాలన్నారు. ఈ సందర్భంగా క్రిస్మస్ వేడుకలను పురస్కరించుకుని రఘురామ్, అప్పిరెడ్డి... గవర్నర్‌కు శుభాకాంక్షలు తెలిపారు.