కనీస పింఛను 7,500 చెల్లించాలి

ABN , First Publish Date - 2021-08-02T08:29:30+05:30 IST

భగత్‌సింగ్‌ కోషియార్‌ కమిటీ 2013లో చేసిన సిఫారసులకు లోబడి ఈపీఎస్‌-95 పింఛనుదారులకు కనీస పింఛను కింద రూ.7,500ను చెల్లించాలని ఏపీ ఈపీఎస్‌-95 పెన్షనర్ల

కనీస పింఛను 7,500 చెల్లించాలి

ఏపీ ఈపీఎస్‌-95 పెన్షనర్ల సంఘం డిమాండ్‌


న్యూఢిల్లీ, ఆగస్టు 1(ఆంధ్రజ్యోతి): భగత్‌సింగ్‌  కోషియార్‌ కమిటీ 2013లో చేసిన సిఫారసులకు లోబడి ఈపీఎస్‌-95 పింఛనుదారులకు కనీస పింఛను కింద రూ.7,500ను చెల్లించాలని ఏపీ ఈపీఎస్‌-95 పెన్షనర్ల సంఘం కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేసింది. ఆ సంఘం నేతలు ఎల్‌.మురళి(ఏపీఎ్‌సఆర్టీసీ), కె.మాధవరావు, టి.ప్రభాకర్‌రెడ్డి(కేసీపీ లిమిటెడ్‌) ఆదివారం ఇక్కడ ఏపీ భవన్లో విలేకర్లతో మాట్లాడుతూ ఈపీఎస్‌ పింఛన దారులకు కరువు భత్యం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. ఈ పథకం కింద ఏపీలో సుమారు 2,70,000మంది వరకు ఉన్నట్లు ‘ఆంధ్రజ్యోతి‘కి  చెప్పారు.

Updated Date - 2021-08-02T08:29:30+05:30 IST