మావోయిస్టుల్లా టీడీపీనీ నిషేధించాలి

ABN , First Publish Date - 2021-10-21T08:30:57+05:30 IST

రాష్ట్రంలో మావోయిస్టు పార్టీలను నిషేధించినట్లే... టీడీపీని కూడా నిషేధించాలని మంత్రి బొత్స సత్యన్నారాయణ వ్యాఖ్యానించారు.

మావోయిస్టుల్లా టీడీపీనీ నిషేధించాలి

అరాచకం రేపి రాజకీయ లబ్ధికి యత్నం: బొత్స

విజయనగరం, అక్టోబరు 20 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో మావోయిస్టు పార్టీలను నిషేధించినట్లే... టీడీపీని కూడా నిషేధించాలని మంత్రి బొత్స సత్యన్నారాయణ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో అరాచకాలు సృష్టిస్తూ...దానివల్ల శాంతిభద్రతలు లోపిస్తే రాజకీయంగా లబ్ధి పొందేందుకు చంద్రబాబు చూస్తున్నారని బొత్స ఆరోపించారు. ‘‘పట్టాభి మాట్లాడిన మాటలకు చంద్రబాబు ఏం సమాధానం చెబుతారు? ముఖ్యమంత్రిని అనాల్సిన మాటలేనా అవి! నోటికి అన్నం తింటున్నావా? ఆర్టికల్‌ 356 ప్రయోగించాలని కోరడం చంద్రబాబు నేర స్వభావాన్ని తెలియజేస్తోంది. మమ్మల్ని కాదు, టీడీపీని నిషేధించాలని ఎన్నికల సంఘాన్ని కలిసి ఫిర్యాదుచేస్తాం’’ అని బొత్స తెలిపారు. బీజేపీతో ఉన్నానంటూ టీడీపీ అధినేత చంద్రబాబును జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ సమర్థించటం సిగ్గుచేటని, ఆయన వ్యాఖ్యలను ఖండిస్తున్నామన్నారు.

Updated Date - 2021-10-21T08:30:57+05:30 IST