న్యాయదేవతే శ్రీరామరక్ష: రాజధాని రైతులు

ABN , First Publish Date - 2021-05-18T09:31:13+05:30 IST

న్యాయదేవత లేకపోతే అక్రమాలను ప్రశ్నించే గొంతుకలను ఈ ప్రభుత్వం నొక్కేసేదని రాజధాని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

న్యాయదేవతే శ్రీరామరక్ష: రాజధాని రైతులు

 517వ రోజుకు చేరుకున్న రాజధాని రైతుల ఆందోళనలు

తుళ్లూరు, మే 17: న్యాయదేవత  లేకపోతే అక్రమాలను ప్రశ్నించే గొంతుకలను ఈ ప్రభుత్వం నొక్కేసేదని రాజధాని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతి రాష్ట్ర ఏకైక రాజధానిగా కొనసాగాలని రైతులు, రైతులు కూలీలు చేస్తున్న ఉద్య మం సోమవారంతో 517వ రోజు కు చేరుకుంది. రైతులు మాట్లాడుతూ అమరావతికి భూములు త్యాగం చేసిన రైతుల పక్షాన రఘరామకృష్ణరాజు ఉండటమే నేరమని ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టి జైలులకు పంపిందన్నారు. అమరావతి రాష్ట్ర ఏకైక రాజధానిగా  కొనసాగాలని రైతుల ఇళ్ళ నుంచి, రైతు శిబిరాల నుంచి ఆందోళనలు కొనసాగాయి.  

Updated Date - 2021-05-18T09:31:13+05:30 IST