వైఎస్‌ఆర్‌టీపీ ఆవిర్భావం నేడే
ABN , First Publish Date - 2021-07-08T08:11:07+05:30 IST
తెలంగాణలో షర్మిల పార్టీ ఆవిర్భావ ప్రకటన గురువారం జరగనుంది. వైఎ్‌సఆర్ జయంతిని పురస్కరించుకుని జూబ్లీహిల్స్‌లోని ఓ ఫంక్షన్ హాల్లో ఆమె తన పార్టీ పేరును ప్రకటిస్తారు

పార్టీ జెండా ఆవిష్కరించనున్న షర్మిల
హైదరాబాద్, జూలై 7(ఆంధ్రజ్యోతి): తెలంగాణలో షర్మిల పార్టీ ఆవిర్భావ ప్రకటన గురువారం జరగనుంది. వైఎ్‌సఆర్ జయంతిని పురస్కరించుకుని జూబ్లీహిల్స్‌లోని ఓ ఫంక్షన్ హాల్లో ఆమె తన పార్టీ పేరును ప్రకటిస్తారు. పార్టీ పేరు వైఎ్‌సఆర్ తెలంగాణ పార్టీ అన్న సంగతి తెలిసిందే. పార్టీ జెండానూ షర్మిల ఆవిష్కరించనున్నారు. తెలంగాణలోని అన్ని జిల్లాల పార్టీ ముఖ్యులు కార్యక్రమంలో పాల్గొననున్నారు. బెంగళూరు నుంచి బుధవారం ఏపీలోని ఇడుపులపాయకు చేరుకున్న షర్మిల.. గురువారం ఉదయం తన తండ్రి సమాధి ముందు పార్టీ జెండాను ఉంచి ఆశీర్వాదం తీసుకుంటారు. వైఎ్‌సఆర్ సతీమణి విజయలక్ష్మి, పార్టీ ముఖ్యనేతలు కొండా రాఘవరెడ్డి, పిట్టా రాంరెడ్డి ఆ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం ప్రత్యేక విమానంలో జూబ్లీహిల్స్‌లోని ఫంక్షన్ హాల్‌కు ర్యాలీగా చేరుకుంటారు.