5 రోజుల్లో దంపతులు మృతి

ABN , First Publish Date - 2021-05-30T08:53:43+05:30 IST

కరోనా మహమ్మారి ఓ కుటుంబంలో విషాదం నింపింది. తల్లి చివరి చూపు కోసం విదేశాల నుంచి వచ్చిన కుమారులకు.. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తండ్రి కూడా మరణించాడన్న పిడుగులాంటి వార్త అందింది

5 రోజుల్లో దంపతులు  మృతి

కెనడా నుంచి బిడ్డలు వచ్చేలోపే ఇద్దరూ..


తెనాలి, మే 29 (ఆంధ్రజ్యోతి): కరోనా మహమ్మారి ఓ కుటుంబంలో విషాదం నింపింది. తల్లి చివరి చూపు కోసం విదేశాల నుంచి వచ్చిన కుమారులకు.. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తండ్రి కూడా మరణించాడన్న పిడుగులాంటి వార్త అందింది. గుంటూరు జిల్లా తెనాలికి చెందిన బొబ్బిలి అప్పారావు, విజయ దంపతులకు కరోనా సోకటంతో మూడు వారాల క్రితం విజయవాడలోని ప్రైవేటు ఆస్పత్రిలో చేరారు. ఐదు రోజుల క్రితం విజయ మరణించారు. కెనడాలో ఉన్న వారి కుమారులకు సమాచారం అందించగా, తాము  వచ్చేవరకు అంత్యక్రియలు చేయవద్దని కోరడంతో.. ఆమె మృతదేహాన్ని మార్చురీలో భద్రపరిచారు. ఆమె కుమారులు కెనడా నుంచి విజయవాడకు వచ్చిన రోజే ,  ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తండ్రి కూడా మరణించారు. దీంతో కుమారులు కన్నీరుమున్నీరయ్యారు. ఆ దంపతులకు శనివారం తెనాలిలో సత్యం, శివం, సుందరం సామాజిక సేవా కేంద్రం సహకారంతో అంత్యక్రియలు నిర్వహించారు. 

Updated Date - 2021-05-30T08:53:43+05:30 IST