కౌంటరుకు సమయం కావాలి

ABN , First Publish Date - 2021-10-25T05:30:00+05:30 IST

అక్రమాస్తుల కేసులో వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ఇటీవల దాఖలుచేసిన డిశ్చార్జి పిటిషన్‌పై కౌంటర్‌ వేయడానికి తనకు సమయం

కౌంటరుకు సమయం కావాలి

జగన్‌ అక్రమాస్తుల కేసులో కోరిన ఈడీ



హైదరాబాద్‌, అక్టోబరు 25 (ఆంధ్రజ్యోతి): అక్రమాస్తుల కేసులో వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ఇటీవల దాఖలుచేసిన డిశ్చార్జి పిటిషన్‌పై కౌంటర్‌ వేయడానికి తనకు సమయం కావాలని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్ట్టరేట్‌ కోరింది. ఈ మేరకు నాంపల్లి సీబీఐ ప్రత్యేక కోర్టుకు ఈడీ తెలిపింది. సోమవారం సీబీఐ ప్రత్యేక కోర్టులో వైఎస్‌ జగన్‌ అక్రమాస్తుల కేసుపై విచారణ కొనసాగింది. ఓఎంసీ, ఇండియా సిమెంట్స్‌, జగతి పబ్లికేషన్స్‌ తదితర కేసుల్లో సీఎం జగన్‌, ఎంపీ విజయసాయిరెడ్డి, మహిళా అధికారి ఎర్రా శ్రీలక్ష్మి తదితరులు డిశ్చార్జి పిటిషన్లను ఈ మధ్య దాఖలుచేశారు. వాటిపై ఈడీ కౌంటరు వేయాల్సి ఉంది. అయితే, ‘‘కౌంటరు వేసేందుకు కొన్ని ప్రత్యేక వివరాలు సేకరించాల్సి ఉంది. ఆ ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదు’’ అని కోర్టుకు వివరించింది. దీంతో కేసు విచారణను నవంబర్‌ 2కి కోర్టు వాయిదా వేసింది. 

Updated Date - 2021-10-25T05:30:00+05:30 IST