ఆక్సిజన్ కోసం ఏపీ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు

ABN , First Publish Date - 2021-05-09T21:47:48+05:30 IST

కోవిడ్ బారీన పడిన రోగులకు సకాలంలో ఆక్సిజన్ అందించేందుకు ఏపీ ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది.

ఆక్సిజన్ కోసం ఏపీ ప్రభుత్వం  ప్రత్యేక చర్యలు

అమరావతి: కోవిడ్ బారీన పడిన రోగులకు సకాలంలో ఆక్సిజన్ అందించేందుకు ఏపీ ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. ఇందుకోసం ఏపీ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఈ చర్యల్లో భాగంగా 50 క్రాయోజెనిక్ ఆక్సిజన్ ట్యాంకర్ల కొనుగోలు, 49 చోట్ల ఆక్సిజన్ ప్లాంట్లకు పైపులైన్ల ఏర్పాటుకు ఏపీ ప్రభుత్వం సత్వర చర్యలు చేపట్టింది. సివిల్, ఎలక్ట్రికల్ పనులకు, 10వేల ఆక్సిజన్ పైపులైన్ల ఏర్పాటు దిశగా ఏపీ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఆక్సిజన్ పైపులైన్‌ మెయింటెనెన్స్‌కు జిల్లాకు నెలకు 10 లక్షలు చొప్పున.. 6 నెలలకు పరిపాలన అనుమతులు ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సుమారు 310 కోట్ల రూపాయలకు పరిపాలన అనుమతులు ఇస్తూ.. వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ ఉత్తర్వులు జారీ చేశారు. 

Updated Date - 2021-05-09T21:47:48+05:30 IST