తంగెడ వీఆర్వో ఆత్మహత్యాయత్నం

ABN , First Publish Date - 2021-10-07T09:44:15+05:30 IST

మండలంలోని తంగెడ వీఆర్వో దాసరి దానియేలు వంటిపై పెట్రోలు పోసుకుని ఆత్మహత్యకు యత్నించిన ఘటన గుంటూరు జిల్లా దాచేపల్లి మండల తహసీల్దార్‌ కార్యాలయం వద్ద బుధవారం చోటుచేసుకుంది.

తంగెడ వీఆర్వో ఆత్మహత్యాయత్నం

దాచేపల్లి, అక్టోబరు 6: మండలంలోని తంగెడ వీఆర్వో దాసరి దానియేలు వంటిపై పెట్రోలు పోసుకుని ఆత్మహత్యకు యత్నించిన ఘటన గుంటూరు జిల్లా దాచేపల్లి మండల తహసీల్దార్‌ కార్యాలయం వద్ద బుధవారం చోటుచేసుకుంది. తంగెడ వీఆర్వోగా దానియేలు 8 నెలలుగా విధులు నిర్వర్తిస్తున్నారు. గ్రామానికి చెందిన రైతుల భూములకు సంబంధించి అడంగల్‌, 1బీ దరఖాస్తులు పంపినా పనులు పూర్తికావడంలేదు. పైగా తహసీల్దార్‌ తనను సమావేశాలకు రాకుండా ఆదేశాలు జారీచేస్తున్నారని దానియేలు ఆరోపించారు. ఈ విషయమై పలుమార్లు తహసీల్దార్‌ వెంకటేశ్వరనాయక్‌కు విన్నవించినా పట్టించుకోకపోగా, నిర్లక్ష్యంగా సమాధానం రావడంతో చేసేదేమీలేక దానియేలు తన భార్యతో కలిసి సాయంత్రం తహసీల్దార్‌ కార్యాలయానికి వచ్చి వంటిపై పెట్రోలు పోసుకున్నారు. అక్కడేవున్న తోటి వీఆర్వోలు, స్థానికులు ఆయన ప్రయత్నాన్ని అడ్డుకుని సముదాయించారు. ఆ సమయంలో తహసీల్దార్‌ కార్యాలయంలో లేరు.

Updated Date - 2021-10-07T09:44:15+05:30 IST