నిమ్మగడ్డపై ఫిర్యాదును ప్రివిలైజ్‌ కమిటీకి పంపిన స్పీకర్‌ తమ్మినేని

ABN , First Publish Date - 2021-02-02T01:32:22+05:30 IST

ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌పై ఫిర్యాదును ప్రివిలైజ్‌ కమిటీకి స్పీకర్‌ తమ్మినేని సీతారాం పంపారు.

నిమ్మగడ్డపై ఫిర్యాదును ప్రివిలైజ్‌ కమిటీకి పంపిన స్పీకర్‌ తమ్మినేని

అమరావతి: ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌పై ఫిర్యాదును ప్రివిలైజ్‌ కమిటీకి స్పీకర్‌ తమ్మినేని సీతారాం పంపారు. ఎస్‌ఈసీపై మంత్రులు పెద్దిరెడ్డి, బొత్స సత్యనారాయణ సభాహక్కుల ఫిర్యాదు చేశారు. ప్రివిలైజ్ కమిటీకి తమ్మినేని పంపారు. ప్రివిలైజ్ కమిటీ నివేదిక తర్వాత స్పీకర్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఎస్‌ఈసీ నిమ్మగడ్డపై బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సభాహక్కుల నోటీసు ఇచ్చారు. తనను కించపరిచేలా వ్యాఖ్యలు చేశారంటూ వీరిద్దరిపై గవర్నర్‌కు ఎస్‌ఈసీ ఫిర్యాదు చేశారు. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసిన మంత్రులు... నిమ్మగడ్డపై చర్యలు తీసుకోవాలంటూ స్పీకర్‌కు శనివారం ఈ-మెయిల్‌లో సభాహక్కుల నోటీసు పంపారు. గవర్నర్‌కు రాసిన లేఖలో నిరాధారమైన ఆరోపణలు చేశారని, సభ్యుల హక్కులను కాలరాసేలా వ్యవహరించిన నిమ్మగడ్డపై చర్యలు తీసుకోవాలని మంత్రులు కోరారు.

Updated Date - 2021-02-02T01:32:22+05:30 IST