బీసీ రిజర్వేషన్లు మరో పదేళ్లు పొడిగింపు

ABN , First Publish Date - 2021-05-20T09:18:24+05:30 IST

విద్య, ఉద్యోగాల్లో బీసీలకు అందుతున్న రిజర్వేషన్లను మరో పదేళ్లు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. రాష్ట్రంలో బీసీలను

బీసీ రిజర్వేషన్లు మరో పదేళ్లు పొడిగింపు

అమరావతి, మే 19 (ఆంధ్రజ్యోతి): విద్య, ఉద్యోగాల్లో బీసీలకు అందుతున్న రిజర్వేషన్లను మరో పదేళ్లు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. రాష్ట్రంలో బీసీలను ఏ, బీ, సీ, డీ, ఈ కేటగిరీలుగా గుర్తించి వారికి ప్రభుత్వ ఉద్యోగాల్లోను, విద్యా సంస్థల్లో సీట్ల కేటాయింపుల్లో  ప్రభుత్వం కల్పిస్తున్న రిజర్వేషన్లు మే నెలాఖరుతో ముగియనున్నాయి. మరో పదేళ్ల పాటు ఈ రిజర్వేషన్ల ఫలాలు అందుకునే అవకాశం కల్పించాలని బీసీ కమిషన్‌ రాష్ట్ర ప్రభుత్వానికి సిఫారసు చేయడంతో ప్రభుత్వం ఆ మేరకు ఉత్తర్వులు జారీచేసింది. 

Updated Date - 2021-05-20T09:18:24+05:30 IST