ఉపసంహరణ పిటిషన్‌ త్వరగా తేల్చండి

ABN , First Publish Date - 2021-08-10T09:26:34+05:30 IST

కృష్ణా జలాల పంపకాలపై ట్రెబ్యునల్‌ ఏర్పాటు చేయాలన్న పిటిషన్‌ను ఉపసంహరించుకోడానికి దాఖలుచేసిన దరఖాస్తు మీద త్వరగా విచారణ జరపాలని సుప్రీంకోర్టుకు...

ఉపసంహరణ పిటిషన్‌ త్వరగా తేల్చండి

  • కృష్ణా ట్రైబ్యునల్‌పై సుప్రీంకోర్టుకు తెలంగాణ విజ్ఞప్తి

న్యూఢిల్లీ, ఆగస్టు 9 (ఆంధ్రజ్యోతి): కృష్ణా జలాల పంపకాలపై ట్రెబ్యునల్‌ ఏర్పాటు చేయాలన్న పిటిషన్‌ను ఉపసంహరించుకోడానికి దాఖలుచేసిన దరఖాస్తు మీద త్వరగా విచారణ జరపాలని సుప్రీంకోర్టుకు తెలంగాణ ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. సోమవారం ఈ అంశాన్ని న్యాయమూర్తులు జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌, జస్టిస్‌ ఎంఆర్‌ షాతో కూడిన ధర్మాసనం ముందు తెలంగాణ ప్రభుత్వం తరఫున సీనియర్‌ న్యాయవాది సీఎస్‌ వైద్యనాథన్‌ ప్రస్తావించారు. ట్రైబ్యునల్‌ ఏర్పాటు కోరుతూ వేసిన పిటిషన్‌ను ఉపసంహరించుకోవాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. పిటిషన్‌ ఉపసంహరణకు అప్లికేషన్‌ దాఖలు చేశామని, అది చాలా రోజులుగా ధర్మాసనం ముందుకు రావడం లేదని చెప్పారు. దీనికి సంబంధించిన వివరాలను కోర్టు మాస్టర్‌కు ఈ-మెయిల్‌ ద్వారా పంపించాలని తెలంగాణ న్యాయవాదికి ధర్మాసనం సూచించింది.


Updated Date - 2021-08-10T09:26:34+05:30 IST