ఆర్‌డీఎస్‌ను స్వాధీనం చేసుకోండి

ABN , First Publish Date - 2021-11-02T08:25:28+05:30 IST

రాజోలిబండ డైవర్షన్‌ స్కీమ్‌(ఆర్డీఎస్‌) హెడ్‌రెగ్యులేటర్‌ను ప్రత్యక్ష నియంత్రణలోకి తీసుకోవాలని కృష్ణా బోర్డును తెలంగాణ కోరింది.

ఆర్‌డీఎస్‌ను స్వాధీనం చేసుకోండి

  • కృష్ణా బోర్డుకు తెలంగాణ లేఖ


హైదరాబాద్‌, నవంబరు 1(ఆంధ్రజ్యోతి): రాజోలిబండ డైవర్షన్‌ స్కీమ్‌(ఆర్డీఎస్‌) హెడ్‌రెగ్యులేటర్‌ను ప్రత్యక్ష నియంత్రణలోకి తీసుకోవాలని కృష్ణా బోర్డును తెలంగాణ కోరింది. ఈ మేరకు సోమవారం కేఆర్‌ఎంబీ చైర్మన్‌ మహేంద్రప్రతా్‌పసింగ్‌కు ఆ రాష్ట్ర నీటిపారుదల శాఖ ఈఎన్‌సీ సి.మురళీధర్‌రావు లేఖ రాశారు. మూడు దశాబ్దాలుగా ఆర్‌డీఎస్‌ కింద ఉన్న కరువు ప్రాంతాలకు నీరు అందడం లేదని, 15 ఏళ్లుగా ఆధునికీకరణ పనులు పూర్తి కావడం లేదని తెలిపారు. పనులు చేపడితే శాంతి భద్రతల సమస్య ఏర్పడే అవకాశం ఉందంటూ ఏపీ అభ్యంతరం చెబుతోందన్నారు. ఇప్పటికైనా దానిని బోర్డు ప్రత్యక్ష నియంత్రణలోకి తీసుకొచ్చి, షెడ్యూల్‌-2 జాబితాలో చేర్చాలని కోరారు.

Updated Date - 2021-11-02T08:25:28+05:30 IST