బొగ్గు బకాయిలు ఎగ్గొట్టారు

ABN , First Publish Date - 2021-10-19T08:31:37+05:30 IST

‘‘బొగ్గు సరఫరా చేసిన వారికి బకాయిలు చెల్లించకుండా వైసీపీ ప్రభుత్వం ఎగ్గొట్టింది. దాని ఫలితంగానే ఇప్పుడు బొగ్గు, విద్యుత్‌ కొరత వచ్చాయి. విద్యుత్‌ వాడకం 20 శాతం పెరిగిందని, అందువల్లే కొరత వచ్చిందని ప్రభుత్వం అసత్య ప్రచారం చేస్తోంది’’

బొగ్గు బకాయిలు ఎగ్గొట్టారు

  • ప్రభుత్వానిది అసత్య ప్రచారం: టీడీపీ


అమరావతి, అక్టోబరు 18 (ఆంధ్రజ్యోతి): ‘‘బొగ్గు సరఫరా చేసిన వారికి బకాయిలు చెల్లించకుండా వైసీపీ ప్రభుత్వం ఎగ్గొట్టింది. దాని ఫలితంగానే ఇప్పుడు బొగ్గు, విద్యుత్‌ కొరత వచ్చాయి. విద్యుత్‌ వాడకం 20 శాతం పెరిగిందని, అందువల్లే కొరత వచ్చిందని ప్రభుత్వం అసత్య ప్రచారం చేస్తోంది’’ అని టీడీపీ రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్ర కుమార్‌ ఆరోపించారు. సోమవారం ఇక్కడ విలేకరులతో ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం ప్రజలపై రూ.12 వేల కోట్లు చార్జీల రూపంలో అదనంగా మోపిందని, ఇవిగాక పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ ద్వారా రూ.24 వేల కోట్లు అప్పులు తెచ్చిందని, ఈ డబ్బులన్నీ ఏం చేశారని ప్రశ్నించారు. కాగా, గంజాయి సాగు వెనుక విజయసాయిరెడ్డి ఉన్నారని మాజీ మంత్రి నక్కా ఆనందబాబు విమర్శించారు. రాష్ట్రంలో గంజాయి మాఫియాను తెలంగాణ పోలీసులు వచ్చి పట్టుకుంటే ఇక్కడ పోలీసులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. 

Updated Date - 2021-10-19T08:31:37+05:30 IST