విశాఖలో టీడీపీ, వైసీపీ మధ్య కొనసాగుతున్న పోటీ

ABN , First Publish Date - 2021-03-14T19:33:18+05:30 IST

జీవీఎంసీ మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్‌లో ప్రధానంగా టీడీపీ, వైసీపీ మధ్య పోటీ కొనసాగుతోంది.

విశాఖలో టీడీపీ, వైసీపీ మధ్య కొనసాగుతున్న పోటీ

విశాఖ: జీవీఎంసీ మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్‌లో ప్రధానంగా టీడీపీ, వైసీపీ మధ్య పోటీ కొనసాగుతోంది. 13 స్థానాల్లో వైసీపీ, 11 స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఒక ఇండిపెండెంట్ అభ్యర్థి, జనసేన నుంచి ఒకరు లీడ్‌లో కొనసాగుతున్నారు. అలాగే సీపీఐ కూడా ఆధిక్యంలో ఉన్నట్లు సమాచారం. పోస్టల్ బ్యాలెట్ నుంచి కూడా టీడీపీ, వైసీపీ మధ్యే హోరాహోరీ పోటీ కొనసాగుతోంది.


యలమంచిలి మున్సిపాలిటీలో అయితే పూర్తి ఆధిక్యత వైసీపీకే ఉన్నట్లు సమాచారం. ఇక్కడ 25 స్థానాల్లో వైసీపీ 23, టీడీపీ 2 స్థానాలు గెలుచుకున్నాయి. అలాగే నర్సిపట్నంలో అయితే వైసీపీ ఆధిక్యంలో ఉన్నట్లు తెలియవచ్చింది. టీడీపీ మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు సతీమణి వార్డు అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు.

Updated Date - 2021-03-14T19:33:18+05:30 IST