విజయనగరం రాజులతో పోలికా?: పల్లా

ABN , First Publish Date - 2021-06-21T10:51:34+05:30 IST

‘‘దేశాన్ని రక్షించే సైనికులను అందించే కోరుకొండ సైనిక్‌ స్కూలుకు భూములు, భవనాలు దానంగా ఇచ్చిన ఘనత విజయనగరం పూసపాటి రాజులది. దేశాన్నిదోచుకొనే అవినీతిపరుల్ని తయారుచేసే చరిత్ర మీది. రాజుల చరిత్ర

విజయనగరం రాజులతో పోలికా?: పల్లా

విశాఖపట్నం, జూన్‌ 20(ఆంధ్రజ్యోతి): ‘‘దేశాన్ని రక్షించే సైనికులను అందించే కోరుకొండ సైనిక్‌ స్కూలుకు భూములు, భవనాలు దానంగా ఇచ్చిన ఘనత విజయనగరం పూసపాటి రాజులది. దేశాన్నిదోచుకొనే అవినీతిపరుల్ని తయారుచేసే చరిత్ర మీది. రాజుల చరిత్ర తెలుసుకుని మాట్లాడాలి. లేకపోతే ఉత్తరాంధ్ర ప్రజల ఆగ్రహానికి గురవుతారు’’ అని టీడీపీ విశాఖ పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు హెచ్చరించారు. ఆదివారం పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.  నీతి నిజాయితీలకు నిలువుటెత్తు నిదర్శనం అశోక్‌ గజపతిరాజు అని, అటువంటి వ్యక్తి కాలిగోటికి కూడా విజయసాయి సరిపోడని విమర్శించారు. అశోక్‌పై చేసిన వ్యాఖ్యలను తక్షణమే వెనక్కి తీసుకోవాలని, లేకపోతే విజయసాయిరెడ్డి బెయిలు రద్దు చేయాలని ఉత్తరాంధ్ర నుంచి 500 మందితో పిటిషన్లు వేస్తామని హెచ్చరించారు. ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహ్మద్‌ నజీర్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2021-06-21T10:51:34+05:30 IST