బడ్జెట్ సమావేశాన్ని వ్యతిరేకిస్తూ టీడీపీ వినూత్న నిరసన

ABN , First Publish Date - 2021-05-20T17:49:33+05:30 IST

ఏపీ అసెంబ్లీ సమావేశాన్ని బహిష్కరించాలని టీడీపీ నిర్ణయించింది. ప్రజా సమస్యలపై చర్చకు...

బడ్జెట్ సమావేశాన్ని వ్యతిరేకిస్తూ టీడీపీ వినూత్న నిరసన

అమరావతి: ఏపీ అసెంబ్లీ సమావేశాన్ని బహిష్కరించాలని టీడీపీ నిర్ణయించింది. ప్రజా సమస్యలపై చర్చకు నేటి నుంచి రెండు రోజులపాటు సమాంతర అసెంబ్లీ సమావేశాలను తెలుగుదేశం పార్టీ నిర్వహించనుంది. అనంతరం తీర్మానాలు చేసి స్పీకర్‌కు టీడీఎల్పీ పంపనుంది. ఒక రోజు బడ్జెట్ సమావేశాన్ని వ్యతిరేకిస్తున్న టీడీపీ.. వినూత్నంగా నిరసన తెలిపేందుకు సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా టీడీపీ నేతలు సమాంతర సభ నిర్వహించనున్నారు. 


ఇవాళ జరిగే అసెంబ్లీ సమావేశాన్ని బహిష్కరించాలని నిర్ణయించిన తెలుగుదేశం శాసనసభా పక్షం.. ప్రజా సమస్యలపై చర్చకు రెండు రోజులపాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది. సమాంతర బీఏసీ సమావేశాన్ని నిర్వహించి.. రెండు రోజుల చర్చనీయాంశాలను ఖరారు చేసింది. సమాంతర అసెంబ్లీ సమావేశం గురువారం సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు, అలాగే శుక్రవారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు జరుగుతుంది. ఆన్ లైన్‌లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా దీనిని నిర్వహిస్తారు.

Updated Date - 2021-05-20T17:49:33+05:30 IST