మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై టీడీపీ సమీక్ష
ABN , First Publish Date - 2021-12-01T02:22:17+05:30 IST
ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై టీడీపీ

అమరావతి: ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై టీడీపీ సమీక్ష జరుపనుంది. బుధవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో కొండపల్లి, జగ్గయ్యపేట నేతలతో అధినేత భేటీ కానున్నారు. సక్రమంగా పని చేయని, బలహీనంగా ఉన్న చోట నియోజకవర్గ ఇంచార్జ్లను మార్చే యోచనలో టీడీపీ ఉంది. క్షేత్రస్థాయిలో వాస్తవ సమాచారాన్ని అధిష్టానం తెప్పించుకుంది. పార్టీ బలోపేతం దిశగా టీడీపీ అధిష్టానం కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది.