మీ వ్రతం ఫలవంతమై సంతోషంగా ఉండాలి : చంద్రబాబు

ABN , First Publish Date - 2021-08-20T18:08:32+05:30 IST

సకల సౌభాగ్యప్రదమైన వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరిస్తున్న తెలుగింటి మహిళలందరికి టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. ‘మీ వ్రతం ఫలవంతమై

మీ వ్రతం ఫలవంతమై సంతోషంగా ఉండాలి : చంద్రబాబు

అమరావతి : సకల సౌభాగ్యప్రదమైన వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరిస్తున్న తెలుగింటి మహిళలందరికి టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. ‘మీ వ్రతం ఫలవంతమై ఆ లక్ష్మీదేవి మీ ఇంటిల్లిపాదికి లక్ష్మీదేవి దీవెనలు, నిత్య సంతోషాలను, ఆరోగ్యాన్ని అనుగ్రహించాలి’ అని చంద్రబాబు కోరుకుంటున్నట్లు ట్వీట్‌లో తెలిపారు. కాగా.. అంతకుమునుపు నారా లోకేష్ కూడా ట్వీట్ చేశారు. ‘సకల సౌభాగ్యాలను, సుఖ సంతోషాలను ఆహ్వానిస్తూ... తెలుగింటి ఆడపడుచులు వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరిస్తున్న శుభవేళ... మీ ఇంటిల్లిపాదికీ ఆ లక్ష్మీదేవి దీవెనలు లభించాలని, మీ ఇల్లు సిరిసంపదలతో, ఆనంద ఆరోగ్యాలతో తులతూగాలి’ అని ట్విట్టర్ వేదికగా లోకేష్ రాసుకొచ్చారు.

Updated Date - 2021-08-20T18:08:32+05:30 IST