నవరత్నాల్లో బూతులూ ఓ రత్నమా?: మంతెన

ABN , First Publish Date - 2021-03-22T09:39:54+05:30 IST

వైసీపీ నవ రత్నాల్లో బూతులు కూడా ఒక రత్నమా? అని టీడీపీ ఎమ్మెల్సీ మంతెన సత్యసత్యనారాయణరాజు ఆ పార్టీ నేతల్ని ప్రశ్నించారు.

నవరత్నాల్లో బూతులూ ఓ రత్నమా?: మంతెన

వైసీపీ నవ రత్నాల్లో బూతులు కూడా ఒక రత్నమా? అని టీడీపీ ఎమ్మెల్సీ మంతెన సత్యసత్యనారాయణరాజు ఆ పార్టీ నేతల్ని ప్రశ్నించారు. చంద్రబాబు, లోకేశ్‌ల గురించి.. తాగి ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదని హెచ్చరించారు. ఈ మేరకు ఆదివారం ఓ ప్రకటన చేశారు. ‘‘రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో పరుగులు పెట్టించిన లోకేశ్‌ను ‘సంస్కారం లేని హీనుడు’ అని కొడాలి నాని విమర్శించడం విడ్డూరంగా ఉంది.


నానిని ఊరిమీద గంగిరెద్దులా జగన్‌రెడ్డి వదిలారు. పెద్ద వారన్న గౌరవం లేకుండా చంద్రబాబుపై నోటికొచ్చినట్లు మాట్లాడితే ఎవ్వరూ చూస్తూ ఊరుకోరు. చంద్రబాబు, లోకేశ్‌ని తిట్టించి, జగన్‌ శునకానందం పొందుతున్నాడు. చంద్రబాబును తిటితే మీరు రాష్ట్రాన్ని అభివృద్ధి చేసినట్లా? బెయిల్‌రెడ్డి పంచన చేరిన బూతులోడు.. చంద్రబాబుని స్టే బాబు అనడం సిగ్గుచేటు’’ అని మండిపడ్డారు. 

Updated Date - 2021-03-22T09:39:54+05:30 IST