ప్రధాని కథనాలపై సీఎం జగన్ ఏం సమాధానం చెబుతారు?: అశోక్‌బాబు

ABN , First Publish Date - 2021-08-21T02:18:05+05:30 IST

ప్రధాని కథనాలపై సీఎం జగన్ ఏం సమాధానం చెబుతారు?: అశోక్‌బాబు

ప్రధాని కథనాలపై సీఎం జగన్ ఏం సమాధానం చెబుతారు?: అశోక్‌బాబు

గుంటూరు: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై టీడీపీ ఎమ్మెల్సీ అశోక్‌బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ ప్రభుత్వం అప్పులపై ప్రధాని సీరియస్‌ అయ్యారన్న కథనాలపై సీఎం జగన్ మోహన్ రెడ్డి ఏం సమాధానం చెబుతారు? అని ఎమ్మెల్సీ అశోక్‌బాబు ప్రశ్నించారు. ఆదాయానికి మించిన ఏపీ అప్పుల వల్లే కేంద్రం అప్పులు ఇవ్వలేమని తెగేసి చెప్పిందని ఆయన విమర్శించారు. ప్రతినెలా చేసిన అప్పులకు రూ. 4,500 కోట్లు వడ్డీలు కట్టాలని ఎమ్మెల్సీ అశోక్‌బాబు అన్నారు. ఆర్థికమంత్రి, శాఖ కార్యదర్శి అప్పుల కోసమే ఢిల్లీలో చక్కర్లు కొడుతున్నారని అశోక్‌బాబు ఆక్షేపించారు.

Updated Date - 2021-08-21T02:18:05+05:30 IST