వంగవీటి రాధాతో టీడీపీ నేతల భేటీ

ABN , First Publish Date - 2021-12-30T22:10:19+05:30 IST

టీడీపీ నేత వంగవీటి రాధాను ఆ పార్టీ నాయకులు

వంగవీటి రాధాతో టీడీపీ నేతల భేటీ

విజయవాడ: టీడీపీ నేత వంగవీటి రాధాను ఆ పార్టీ నాయకులు గద్దె రామ్మోన్‌రావు, బోడే ప్రసాద్‌ భేటీ అయ్యారు. విజయవాడలోని రాధా నివాసంలో వారి మధ్య గంటకు పైగా సమావేశం జరిగింది. తనపై రెక్కి నిర్వహించారన్న రాధా వ్యాఖ్యల నేపథ్యంలో టీడీపీ నేతలు రాధాని కలవడంపై రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. భద్రతపై తగు జాగ్రత్తలు తీసుకోవాలని రాధాకి టీడీపీ నేతలు సూచించారు. 


తనను హత్య చేయడానికి రెక్కీ నిర్వహించారని టీడీపీ నేత వంగవీటి రాధా కలకలం రేపిన సంగతి తెలిసిందే. అయితే తనను చంపేందుకు ఎవరు కుట్ర చేశారో.. ఆ విషయాలను రాధా గోప్యంగా ఉంచారు. రాధా ప్రకటన తర్వాత ఆయనకు ప్రభుత్వం భద్రత కూడా పెంచింది. రాధాకు 2+2 సెక్యూరిటీ ఇవ్వాలని ఏపీ సీఎం జగన్‌ ఆదేశించారు. అంతేకాదు రాధా చేసిన ఆరోపణలపై ఆధారాలు సేకరించి నివేదిక ఇవ్వాలంటూ ఇంటెలిజెన్స్‌ డీజీకి జగన్‌ ఆదేశాలిచ్చారు. ఈ తతంగం నడుస్తున్న నేపథ్యంలోనే వంగవీటి రాధా ఆఫీస్ దగ్గర స్కూటీ కలకలం రేపుతోంది.Updated Date - 2021-12-30T22:10:19+05:30 IST