కొనసాగుతున్న టీడీపీ నేతల గృహ నిర్బంధం

ABN , First Publish Date - 2021-12-19T18:11:30+05:30 IST

అనంతపురం జిల్లాలో టీడీపీ నేతల గృహ నిర్బంధం కొనసాగుతోంది. అనంతపురంలో మాజీ మంత్రి పల్లె, ప్రభాకర్‌ చౌదరిని పోలీసులు హౌస్‌ అరెస్ట్ చేశారు.

కొనసాగుతున్న టీడీపీ నేతల గృహ నిర్బంధం

అనంతపురం : అనంతపురం జిల్లాలో టీడీపీ నేతల గృహ నిర్బంధం కొనసాగుతోంది. అనంతపురంలో టీడీపీ నేతలు పల్లె, ప్రభాకర్‌ చౌదరి, నిమ్మల కిష్టప్పలను పోలీసులు హౌస్‌ అరెస్ట్ చేశారు. బెంగళూరు నుంచి వస్తున్న బీటెక్‌ రవిని సైతం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కర్నూలు జిల్లా ప్యాపిలిలో అక్రమంగా ఎర్రమట్టి తరలింపు జరుగుతున్న విషయమై నిజ నిర్ధారణకు వెళ్లేందుకు సిద్ధమవుతున్న టీడీపీ నేతలను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. 


Updated Date - 2021-12-19T18:11:30+05:30 IST