ఎన్నికలపై కోర్టు తీర్పు ప్రభుత్వానికి చెంపపెట్టు: వెలగపూడి
ABN , First Publish Date - 2021-05-22T03:09:15+05:30 IST
ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను హైకోర్టు రద్దు చేస్తున్నట్లు ప్రకటించడంపై టీడీపీ నేత, ఎమ్మెల్యే వెలగమూడి రామకృష్ణబాబు..

అమరావతి: ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను హైకోర్టు రద్దు చేస్తున్నట్లు ప్రకటించడంపై టీడీపీ నేత, ఎమ్మెల్యే వెలగమూడి రామకృష్ణబాబు హర్షం వ్యక్తం చేశారు. ఎన్నికలు న్యాయబద్ధంగా జరగలేదరని, ఈ విషయంలో హైకోర్టు తీర్పు ప్రభుత్వానికి చెంపపెట్టని ఆయన అన్నారు. అధికార బలంతో ఏదైనా చేయొచ్చని వైసీపీ ప్రభుత్వం అనుకుంటోందని, కానీ న్యాయమనేది ఉంటుందని, దానిని జగన్ సర్కార్ మర్చిపోకూడదని గుర్తు చేశారు. అలాగే రఘురామకృష్ణంరాజు విషయంలో సుప్రీంకోర్టులో ప్రభుత్వం తరపు న్యాయవాది వాదనలు కూడా పూర్తి కక్ష సాధింపు చర్య అని స్పష్టంగా అర్థమవుతోందని అన్నారు.
కాగా.. గత నెలలో రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు నిబంధనలకు అనుగుణంగా జరగలేదంటూ హైకోర్టు మొత్తం ఎన్నికలను రద్దు చేసింది. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలని హైకోర్టు తీర్పును వెలువరించింది. సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా ఎస్‌ఈసీ నోటిఫికేషన్ లేదని పేర్కొంది. పోలింగ్‌కు 4 వారాల ముందు నోటిఫికేషన్ ఇవ్వాలన్న నిబంధన పాటించలేదని హైకోర్టు వ్యాఖ్యానించింది. కేవలం వారం వ్యవధిలోనే ఎన్నికల నిర్వహణకు ఎస్‌ఈసీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇప్పటికే ఎన్నికలు నిర్వహించామని.. కౌంటింగ్‌కు అనుమతించాలని.. ఏపీ ప్రభుత్వం అప్పీల్‌కు వెళ్లనుంది.