పట్టాభికి 14 రోజుల రిమాండ్.. జైలుకు తరలింపు

ABN , First Publish Date - 2021-10-21T22:53:42+05:30 IST

టీడీపీ నేత పట్టాభికి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలపై పోలీసులు పట్టాభిని..

పట్టాభికి 14 రోజుల రిమాండ్.. జైలుకు తరలింపు

విజయవాడ: టీడీపీ నేత పట్టాభికి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. సీఎం జగన్‌పై చేసిన వ్యాఖ్యలపై పోలీసులు పట్టాభిని అరెస్ట్ చేశారు. పట్టాభిని గురువారం మూడో అదనపు మెట్రో పాలిటన్ కోర్టులో ప్రవేశ పట్టడంతో ధర్మాసనం ఆయనకు నవంబర్ 4 వరకు రిమాండ్ విధించింది. పట్టాభి దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను కోర్టు నిరాకరించింది. దీంతో పట్టాభిని పోలీసులు మచిలీపట్నం జైలుకు తరలించారు. 


కాగా తనను పోలీసులు కొట్టలేదని టీడీపీ నేత పట్టాభి తెలిపారు.  తాను సీఎంను గాని, ప్రభుత్వ పెద్దలనుగానీ తూలనాడలేదన్నారు. ప్రభుత్వ లోపాలను ఎత్తి చూపానని చెప్పారు. గతంలో తనపై దాడి జరిగితే దోషులను పట్టుకోలేదని తెలిపారు. అరెస్ట్ చేసిన తర్వాత తనను తోట్లవల్లూరు పోలీస్ స్టేషన్‌లో ఉంచారని పట్టాభి పేర్కొన్నారు. 

Updated Date - 2021-10-21T22:53:42+05:30 IST