అమూల్ ముసుగులో సీఎం జగన్ క్విడ్‌ప్రోకోకు తెర లేపారు : పట్టాభి

ABN , First Publish Date - 2021-05-05T22:40:44+05:30 IST

బినెట్ ఎజెండాలో తొలి అంశంగా ఉండాల్సిన కోవిడ్ చివరి అంశంగా ఉండటం అత్యంత బాధాకరమని

అమూల్ ముసుగులో సీఎం జగన్ క్విడ్‌ప్రోకోకు తెర లేపారు : పట్టాభి

అమరావతి : కేబినెట్ ఎజెండాలో తొలి అంశంగా ఉండాల్సిన కోవిడ్ చివరి అంశంగా ఉండటం అత్యంత బాధాకరమని టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి పేర్కొన్నారు. దీన్ని బట్టే ప్రజల ప్రాణాలపై సీఎం జగన్‌కు ఎంత చిత్తశుద్ధి వుందో అర్థమైపోతోందుని ఎద్దేవా చేధారు. ఆంధ్రాలో అమూల్ అనేది అతిపెద్ద డెయిరీ స్కాం అని ఆయన విమర్శించారు. అమూల్ ముసుగులో పాడి రైతులకు మేలు చేస్తానని చెబుతూ, సీఎం క్విడ్‌ప్రోకోకు తెరలేపారని ఆరోపించారు. ఇతర రాష్ట్రాల్లో మిల్క్ చిల్లింగ్‌కు లీటర్‌కు 50 పైసలు, ప్రాసెసింగ్‌కి లీటరుకు 2 రూపాయలను అమూల్ సంస్థ చెల్లిస్తోందని తెలిపారు. అదే ఏపీలో మాత్రం 5 పైసలు, 12 పైసలా? అంటూ పట్టాభి ప్రశ్నించారు. 


Updated Date - 2021-05-05T22:40:44+05:30 IST