పశ్చిమగోదావరి బస్సు ప్రమాదంపై లోకేష్ దిగ్భ్రాంతి

ABN , First Publish Date - 2021-12-15T19:55:09+05:30 IST

పశ్చిమ‌గోదావ‌రి జిల్లా జంగారెడ్డిగూడెం వ‌ద్ద జరిగిన ఆర్టీసీ బస్సు ప్రమాదంపై టీడీపీ జాతీయ ప్రధానకార్యదర్శి లోకేష్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

పశ్చిమగోదావరి బస్సు ప్రమాదంపై లోకేష్ దిగ్భ్రాంతి

అమరావతి: పశ్చిమ‌గోదావ‌రి జిల్లా జంగారెడ్డిగూడెం వ‌ద్ద జరిగిన ఆర్టీసీ బస్సు ప్రమాదంపై టీడీపీ జాతీయ ప్రధానకార్యదర్శి లోకేష్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల‌కు అశ్రునివాళుల‌ర్పిస్తూ, వారి కుటుంబ‌ స‌భ్యుల‌కు ప్రగఢ సంతాపం తెలిపారు. గాయ‌ప‌డినవారికి మెరుగైన వైద్యం అందించాలన్నారు. మృతుల కుటుంబాల‌కు ఒక్కొక్క‌రికీ రూ.25 ల‌క్ష‌లు ఎక్స్‌గ్రేషియా ప్ర‌క‌టించాలని డిమాండ్ చేశారు. అధ్వాన‌రోడ్ల వ‌ల్లే ప్ర‌మాదం జ‌రిగింద‌ని తెలుస్తోందని విమర్శించారు. కాంట్రాక్ట‌ర్ల‌కి బిల్లులు చెల్లించ‌క‌, ర‌హ‌దారుల నిధులు మ‌ళ్లించ‌డంతో దారుల‌న్నీ అధ్వానంగా మారి ఇలా ప్ర‌జ‌ల ప్రాణాలు తీస్తోందని...ఇది ముమ్మాటికీ ప్ర‌భుత్వ నిర్ల‌క్ష్య‌మే అని లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

Updated Date - 2021-12-15T19:55:09+05:30 IST