అందుకే సీఎం అయ్యావా?: జగన్‌పై జవహర్ విమర్శ

ABN , First Publish Date - 2021-01-20T22:49:56+05:30 IST

భారతి సిమెంట్ అమ్ముకోవడానికే నువ్వు సీఎం అయ్యావా జగన్ రెడ్డి? అంటూ ట్విట్టర్ వేదికగా మాజీ మంత్రి

అందుకే సీఎం అయ్యావా?: జగన్‌పై జవహర్ విమర్శ

అమరావతి: భారతి సిమెంట్ అమ్ముకోవడానికే సీఎం అయ్యావా జగన్ రెడ్డి? అంటూ ట్విట్టర్ వేదికగా మాజీ మంత్రి, టీడీపీ నేత జవహర్ ప్రశ్నించారు. ఆయన ఇంకా ఏమన్నారంటే.. ‘అక్రమ నీటి కేటాయింపుల పర్వం పూర్తయ్యింది. ఇప్పుడు సిమెంట్ మాఫియా డాన్‌గా మారి రేట్లు విపరీతంగా పెంచి ప్రజల్ని దోచుకుంటున్నారు. సహా నిందితుల కంపెనీలతో సిమెంట్ మాఫియా ఏర్పాటు చేసి బస్తాకి 100 నుండి 150 అదనంగా దోచుకుంటున్నారు. నీ అక్రమార్జన కోసం భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి లేకుండా చేసి పొట్టన పెట్టుకున్నావ్. ఇప్పుడు ఏకంగా ప్రభుత్వం కొనే సిమెంట్ అంతా భారతి సిమెంట్. జగన్ కేసుల్లో సహా  నిందితులైన కంపెనీలకే ఆర్డర్లు ఇస్తున్నారు. భారతి సిమెంట్స్ కి 2,28,370 మెట్రిక్ టన్నులు, ఇండియా సిమెంట్స్ కి 1,59,753 మెట్రిక్ టన్నులు, పెన్నా కి 1,50,325 మెట్రిక్ టన్నులు. ఇంకెంత మంది భవన నిర్మాణ కార్మికులను, నిర్మాణ రంగంపై ఆధారపడిన వారిని పొట్టన పెట్టుకుంటే నీ ధన దాహం తీరుతుంది జగన్ రెడ్డి?’ అంటూ నిలదీశారు.

Updated Date - 2021-01-20T22:49:56+05:30 IST