విశాఖ రైల్వేజోన్‌పై సీఎం, వైసీపీ ఎంపీలు ఎందుకు మాట్లాడరు: గౌతుశిరీష
ABN , First Publish Date - 2021-12-09T19:48:23+05:30 IST
విశాఖ రైల్వేజోన్‌పై సీఎం, వైసీపీ ఎంపీలు ఎందుకు మాట్లాడట్లేదని టీడీపీ నేత గౌతు శిరీష ప్రశ్నించారు.

అమరావతి: విశాఖ రైల్వేజోన్‌పై సీఎం, వైసీపీ ఎంపీలు ఎందుకు మాట్లాడట్లేదని టీడీపీ నేత గౌతు శిరీష ప్రశ్నించారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ రైల్వేజోన్‌కు సంబంధించి చంద్రబాబు హయాంలో డీపీఆర్ కూడా సిద్ధమైందని... కానీ ఇప్పుడు జోన్ లేదని కేంద్రం అనడం బాధాకరమన్నారు. ప్రత్యేక హోదా, రైల్వేజోన్‌లను అటకెక్కించిన కేంద్ర వైఖరిపై ఏపీ బీజేపీ నేతలు ఏం చెబుతారని నిలదీశారు. సీఎం జగన్, విజయసాయిరెడ్డి ప్రేమ ఉత్తరాంధ్రపై కాదని... సహజవనరులు, భూములు, ప్రభుత్వ ఆస్తులపైనే వారి ప్రేమ అని గౌతు శిరీష్ వ్యాఖ్యలు చేశారు.