‘అప్పులు’ దిగమింగుతున్నారు: కనకమేడల
ABN , First Publish Date - 2021-10-20T09:16:15+05:30 IST
సంక్షేమం పేరుతో జగన్ ప్రభు త్వం అందిన చోటల్లా అప్పులు తెస్తూ.. ఆ సొమ్మును దిగమింగి, రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తోందని టీడీపీ రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్ విమర్శించారు. రాష్ట్రంలో ఆర్థిక

అమరావతి, అక్టోబరు 19(ఆంధ్రజ్యోతి): సంక్షేమం పేరుతో జగన్ ప్రభు త్వం అందిన చోటల్లా అప్పులు తెస్తూ.. ఆ సొమ్మును దిగమింగి, రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తోందని టీడీపీ రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్ విమర్శించారు. రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభాన్ని సృష్టిస్తున్న జగన్ సర్కారు రెండున్నరేళ్లలో రూ.3 లక్షల కోట్లు అప్పులు చేసి, రూ.1.30 లక్షల కోట్లు మాత్రమే సంక్షేమానికి ఖర్చు పెట్టిందన్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం మాట్లాడుతూ.. సంక్షేమం కోసం అప్పులు తెస్తున్నామని పచ్చి అబద్దాలు చెబుతున్న ప్రభుత్వానికి కొందరు అధికారులు వత్తాసు పలుకుతున్నారని మండిపడ్డారు. అప్పులు, ఖర్చుల వివరాలు ‘కాగ్’కు లెక్కల చెప్పకుండా ప్రభుత్వం దాస్తోందని ఆరోపించారు.