‘ఆయన’ ఎందుకు అభినందనలు చెప్పలేదు?: వర్ల

ABN , First Publish Date - 2021-07-08T09:08:51+05:30 IST

‘‘మిజోరం గవర్నర్‌గా నియమితులైన తెలుగు వ్యక్తి కంభంపాటి హరిబాబుకు అందరూ అభినందనలు చెప్పినా ఒకరు మాత్రం చెప్పలేదు

‘ఆయన’ ఎందుకు అభినందనలు చెప్పలేదు?: వర్ల

‘‘మిజోరం గవర్నర్‌గా నియమితులైన తెలుగు వ్యక్తి కంభంపాటి హరిబాబుకు అందరూ అభినందనలు చెప్పినా ఒకరు మాత్రం చెప్పలేదు. దీనికి కారణం ఏమై ఉంటుంది?’’ అని టీడీపీ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య ప్రశ్నించారు. బుధవారం ఆయన ఒక ట్వీట్‌ చేశారు. ‘‘అందరి కంటే ముందు అభినందనలు చెప్పాల్సిన ఆయన ఇంతవరకూ చెప్పలేదు. గతంలో విశాఖలో వారి మాతృశ్రీకి జరిగిన పరాభవానికి హరిబాబు కారణమనేనా!’’ అని వర్ల సందేహం వ్యక్తం చేశారు. 

Updated Date - 2021-07-08T09:08:51+05:30 IST