అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించాలని టీడీపీ నిర్ణయం

ABN , First Publish Date - 2021-05-18T23:03:37+05:30 IST

ఏపీ శాసనసభ సమావేశాలను బహిష్కరించాలని టీడీపీ నిర్ణయం తీసుకుంది. తూతూమంత్రంగా ఒక రోజు జరిపే అసెంబ్లీ సమావేశాలకు

అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించాలని టీడీపీ నిర్ణయం

అమరావతి: ఏపీ శాసనసభ సమావేశాలను బహిష్కరించాలని టీడీపీ నిర్ణయం తీసుకుంది. తూతూమంత్రంగా ఒక రోజు జరిపే అసెంబ్లీ సమావేశాలకు తాము హాజరుకాలేమని టీడీపీ నేతలు స్పష్టం చేశారు. 6 నెలలు సమావేశాలు నిర్వహించకపోతే ప్రభుత్వం కుప్పకూలుతుందన్న.. ఆందోళనతో అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తున్నారని టీడీపీ శాసనసభా పక్ష ఉపనేత అచ్చెన్నాయుడు విమర్శించారు. 2 లక్షల 11 వేల ఏపీలో బడ్జెట్‌పై విపులంగా చర్చ జరగాలని, తూతూమంత్రంగా చేయాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోందని తప్పుబట్టారు. అందుకే సమావేశాలను బహిష్కరించాలని నిర్ణయించామని అచ్చెన్నాయుడు తెలిపారు. కరోనా యాక్టివ్‌ కేసులు ఉన్న సమయంలో అసెంబ్లీ సమావేశాలను ఎలా నిర్వహిస్తారు?.. మార్చిలో 900 కేసులు ఉంటే అప్పుడెందుకు నిర్వహించలేదు? అని టీడీపీ శాసనమండలి ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు ప్రశ్నించారు. 

Updated Date - 2021-05-18T23:03:37+05:30 IST