రహస్య జీవోలపై గవర్నర్‌కు టీడీపీ ఫిర్యాదు

ABN , First Publish Date - 2021-08-21T09:03:12+05:30 IST

తెలుగుదేశం పార్టీ పొలిట్‌ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య, బొండా

రహస్య జీవోలపై గవర్నర్‌కు టీడీపీ ఫిర్యాదు

విజయవాడ, ఆగస్టు 20(ఆంధ్రజ్యోతి): తెలుగుదేశం పార్టీ పొలిట్‌ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య, బొండా ఉమామహేశ్వరరావు, ఆ పార్టీ క్రమశిక్షణ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడుతో కూడిన ప్రతినిధి బృందం శుక్రవారం సాయంత్రం గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ను కలిసింది. గవర్నమెంట్‌ జీవోలను ఆన్‌లైన్‌ ఉంచకూడదంటూ రాష్ట్ర ప్రభుత్వ తీసుకున్న నిర్ణయంపై ఫిర్యాదు చేసింది. గవర్నర్‌ను కలిసి బయటకు వచ్చిన టీడీపీ నేతలు మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం బ్లాంక్‌ జీవోలు ఇవ్వడానికి వీలులేదని వర్ల రామయ్య చెప్పారు. ప్రభుత్వం జారీ చేసే జీవోలను ఆన్‌లైన్‌లో ఉంచుతారా? లేదా? అనే అంశంపై వారం రోజులు వేచి చూసిన తర్వాత తాము న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని చెప్పారు. 


Updated Date - 2021-08-21T09:03:12+05:30 IST