19నే టీడీపీ ఫిర్యాదు.. సీఎం పేరు ఉండటంతో ఇంకా నమోదు కాని ఎఫ్ఐఆర్

ABN , First Publish Date - 2021-10-22T04:11:39+05:30 IST

19నే టీడీపీ ఫిర్యాదు.. సీఎం పేరు ఉండటంతో ఇంకా నమోదు కాని ఎఫ్ఐఆర్

19నే టీడీపీ ఫిర్యాదు.. సీఎం పేరు ఉండటంతో ఇంకా నమోదు కాని ఎఫ్ఐఆర్

అమరావతి: పార్టీ కార్యాలయంపై దాడి విషయమై ఈ నెల 19న టీడీపీ ఫిర్యాదు చేసింది. మంగళగిరి రూరల్ పీఎస్‌లో టీడీపీ రిసెప్షన్‌ కమిటీ సభ్యుడు కుమారస్వామి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదులో సీఎం, సీఎంఓ అధికారులు, డీజీపీల పేర్ల ప్రస్తావన తెచ్చారు. డీజీపీ, సీఎంవో అధికారులకు తెలిసే దాడి జరిగిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎంపీ నందిగం సురేష్, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, వైసీపీ నేత దేవినేని అవినాష్ ప్రొద్బలంతో పార్టీ కార్యాలయంపై దాడి జరిగిందని ఫిర్యాదు చేశారు. టీడీపీ ఇచ్చిన ఫిర్యాదుపై ఇప్పటికీ ఎఫ్ఐఆర్ నమోదు కాలేదు. ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోవడాన్ని టీడీపీ నేతలు తప్పుబడుతున్నారు. సీఎం, సీఎంఓ, డీజీపీ పేర్లు ఉండబట్టే ఎఫ్ఐఆర్ నమోదులో జాప్యం చేస్తున్నారంటూ టీడీపీ నేతలు అంటున్నారు. ఎఫ్ఐఆర్ నమోదుపై కోర్టును ఆశ్రయించాలని టీడీపీ నేతలు భావిస్తున్నారు. 


Updated Date - 2021-10-22T04:11:39+05:30 IST