నిధులు రాబట్టడంలో జగన్ రెడ్డి విఫలం: చంద్రబాబు

ABN , First Publish Date - 2021-02-02T01:05:32+05:30 IST

కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి నిధులు రాబట్టడంలో జగన్ రెడ్డి విఫలం అయ్యారని టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శించారు

నిధులు రాబట్టడంలో జగన్ రెడ్డి విఫలం: చంద్రబాబు

అమరావతి: కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి నిధులు రాబట్టడంలో జగన్ రెడ్డి విఫలం అయ్యారని టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శించారు. టీడీపీ శ్రేణులతో ఆయన టెలీకాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ‘ప్రత్యేక హోదా లేదు. ఆర్థికలోటు భర్తీ లేదు. 7 వెనుకబడిన జిల్లాలకు నిధులు లేవు. అమరావతికి నిధులు లేవు. పోలవరానికి నిధులు లేవు. పునర్విభజన చట్టంలో అంశాలకు పరిష్కారం లేదు. తన కేసుల మాఫీ కోసం రాష్ట్రాన్నే జగన్ రెడ్డి తాకట్టు పెట్టారు. 25మంది ఎంపీలను ఇస్తే ప్రత్యేక హోదా తెస్తానని నమ్మకద్రోహం చేశారు. 28మంది వైసీపీ ఎంపీలను తన కేసుల మాఫీ కోసమే వాడుతున్నారు’ అని ఆరోపించారు.

Updated Date - 2021-02-02T01:05:32+05:30 IST