ఉప ఎన్నికలు నిష్పక్షపాతంగా జరపాలి

ABN , First Publish Date - 2021-04-16T10:20:51+05:30 IST

తిరుపతి ఉప ఎన్నికలను నిష్పక్షపాతంగా నిర్వహించాలని టీడీపీ నేతలు రాష్ట్ర ఎన్నికల సీఈవో విజయానంద్‌కు విజ్ఞప్తిచేశారు. ప్రజలు స్వేచ్ఛగా ఓటు హక్కు

ఉప ఎన్నికలు నిష్పక్షపాతంగా జరపాలి

సీఈవోకు టీడీపీ విజ్ఞప్తి


అమరావతి, ఏప్రిల్‌ 15(ఆంధ్రజ్యోతి): తిరుపతి ఉప ఎన్నికలను నిష్పక్షపాతంగా నిర్వహించాలని టీడీపీ నేతలు రాష్ట్ర ఎన్నికల సీఈవో విజయానంద్‌కు విజ్ఞప్తిచేశారు. ప్రజలు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలని కోరారు. గురువారం సచివాలయంలో విజయానంద్‌ను ఎమ్మెల్సీ పి.అశోక్‌బాబు తదితరులు కలిశారు. ఉప ఎన్నికల్లో టీడీపీ ఏజెంట్లను పెట్టనీయకుండా బెదిరిస్తున్న ఓజిలి, వాకాడు, ఏర్పేడు పోలీ సు అధికారులపై చర్యలు తీసుకోవాలని, 80ఏళ్ల పైబడిన ఓటర్లకు కల్పించిన పోస్టల్‌ బ్యాలెట్‌ అవకాశాన్ని అధికార పార్టీ నేతలు అవకాశంగా మలుచుకునే పరిస్థితి లేకుండా చూడాలని, అన్ని పోలింగ్‌ బూత్‌ల వద్ద సీసీ కెమేరాలు ఏర్పాటు చేయాలని, ఎన్నికల్లో వలంటీర్ల పాత్ర లేకుండా చూడాలని, చంద్రబాబుపై రాళ్లదాడి ఘటన విచారణ జరిపి, దోషులపై చర్య తీసుకోవాలని, తిరుపతి ఎన్నికల్లో శాంతిభద్రతల పర్యవేక్షణకు సీనియర్‌ ఐపీఎస్‌ అధికారిని నియమించాలని, సమస్యాత్మాక పోలింగ్‌ కేంద్రాల వద్ద కేంద్ర బలగాలను నియమించాలని, అవకతవకలకు అవకాశం లేకుండా అన్ని పోలింగ్‌ కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్‌తో పర్యవేక్షించాలని, నగదు, మద్యం పంపిణీని అడ్డుకోవాలని, కొవిడ్‌ నిబంధనలు పక్కాగా అమలయ్యేలా చూడాలని కోరుతూ వినతిపత్రాన్ని అందజేశారు.


పరిశీలించి, చర్యలు తీసుకుంటామని సీఈవో హామీఇచ్చినట్లు అశోక్‌బాబు చెప్పారు.  ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘందే బాధ్యతన్నారు. తిరుపతిలో 5లక్షల మెజార్టీతో గెలుస్తామన్న వైసీపీ నేతల్లో విశ్వాసం సన్నగిల్లి అరాచకాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. రాళ్ల దాడి జరగలేదని డీఐజీ అనడంపై అభ్యంతరం వ్యక్తంచేశారు. తిరుపతిలో టీడీపీ విజయం ఖాయమన్నారు. 

Updated Date - 2021-04-16T10:20:51+05:30 IST