అనంతపురం జిల్లాలో కీలక మున్సిపాలిటీ టీడీపీ కైవసం

ABN , First Publish Date - 2021-03-14T21:37:29+05:30 IST

అనంతపురం జిల్లాలో కీలక మున్సిపాలిటీ టీడీపీ కైవసం

అనంతపురం జిల్లాలో కీలక మున్సిపాలిటీ టీడీపీ కైవసం

అనంతపురం: జిల్లా వ్యాప్తంగా 337 వార్డుల్లో మున్సిపల్ ఎన్నికలు జరిగాయి. అనంతపురం కార్పొరేషన్, 8 మున్సిపాలిటీలు 02 నగర పంచాయతీలు ఉన్నాయి. అనంతపురం కార్పోరేషన్ మొత్తం ఏకగ్రీవం అయింది. అనంతపురం కార్పొరేషన్ మొత్తం స్థానాలు 50 ఉండగా, వైసీపీ 48, టీడీపీ 0, ఇండిపెండెంట్ 2 స్థానాల్లో గెలుపొందింది. ధర్మవరం మున్సిపాలిటీ మొత్తం వార్డులు 30 ఉండగా, వైసీపీ 30, టీడీపీ 0, గుత్తి మున్సిపాలిటీ మొత్తం వార్డులు 19 ఉండగా, వైసీపీ 18, టీడీపీ 1 స్థానంలో గెలిచింది.


గుంతకల్ మున్సిపాలిటీ మొత్తం వార్డులు 34 ఉండగా, వైసీపీ 25, టీడీపీ 7, సీపీఐ 1 స్థానంలో ఘన విజయం సాధించింది. హిందూపురం మున్సిపాలిటీ మొత్తం వార్డులు 38 ఉండగా, వైసీపీ 29, బీజేపీ 1, టీడీపీ 6, ఎంఐఎం 1, ఇండిపెండెంట్ 1 స్థానంలో గెలిచింది.


కదిరి మున్సిపాలిటీ మొత్తం వార్డులు 36 ఉండగా, వైసీపీ 30, టీడీపీ 5, ఇండిపెండెంట్ 1 స్ధానంలో విజయం సాధించింది. కళ్యాణదుర్గం మున్సిపాలిటీ మొత్తం వార్డులు 24 ఉండగా, వైసీపీ 19, టీడీపీ 4, ఇండిపెండెంట్ 1 స్థానంలో విజయం సాధించింది. మడకశిర మున్సిపాలిటీ మొత్తం వార్డులు 20 ఉండా, వైసీపీ 15, టీడీపీ 5 స్థానాల్లో గెలిచింది. పుట్టపర్తి మున్సిపాలిటీ మొత్తం వార్డులు 20 ఉండగా, వైసీపీ 14, టీడీపీ 6 స్థానాల్లో గెలిచింది. రాయదుర్గం మున్సిపాలిటీ మొత్తం వార్డులు 32 ఉండగా, వైసీపీ 30, టీడీపీ 2 స్థానాల్లో గెలిచింది. తాడిపత్రి మున్సిపాలిటీ మొత్తం వార్డులు 34 ఉండగా, టీడీపీ 18, వైసీపీ 14, సీపీఐ 1, ఇండిపెండెంట్ 1 స్థానంలో గెలుపొందింది.

Updated Date - 2021-03-14T21:37:29+05:30 IST