టీడీపీ, వైసీపీలు పోటాపోటీగా నిరసన ర్యాలీలు
ABN , First Publish Date - 2021-10-20T18:29:06+05:30 IST
పలమనేరు నియోజకవర్గం వీకోటలో టీడీపీ, వైసీపీలు పోటాపోటీగా నిరసన ర్యాలీలు నిర్వహించాయి.

చిత్తూరు: పలమనేరు నియోజకవర్గం వీకోటలో టీడీపీ, వైసీపీలు పోటాపోటీగా నిరసన ర్యాలీలు నిర్వహించాయి. ఒకరిపై ఒకరు ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకున్నాయి. పట్టాభి దిష్టిబొమ్మను వైసీపీ శ్రేణులు దహనం చేశాయి. సీఎం దిష్టిబొమ్మను టీడీపీ శ్రేణులు దహనం చేశాయి. దీంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. పోలీసులు రెండు వర్గాలను అదుపు చేశారు.