ఆ ధైర్యం సజ్జలకు ఉందా?: పట్టాభి

ABN , First Publish Date - 2021-09-02T21:29:26+05:30 IST

ఆ ధైర్యం సజ్జలకు ఉందా?: పట్టాభి

ఆ ధైర్యం సజ్జలకు ఉందా?: పట్టాభి

అమరావతి: సజ్జల విద్యుత్ ఛార్జీల పెంపును సమర్థిస్తూ గత ప్రభుత్వంపై నిందలేస్తున్నారని  టీడీపీ నేత పట్టాభి అన్నారు. జగన్‌రెడ్డి రెండేళ్లలోనే రూ.9,500 కోట్ల వరకు విద్యుత్ ఛార్జీలు పెంచారని మండిపడ్డారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఏపీఈపీడీసీఎల్ ఏ గ్రేడ్‌లో ఉంటే వైసీపీ ప్రభుత్వ హయాంలో సీ గ్రేడ్‌కి పడిపోయిందన్నారు. 2019 మార్చి 31కి ఏపీ డిస్కంలు తక్కువ అప్పుల్లోనే ఉన్నాయని కేంద్రమే చెప్పిందన్నారు. ఈ వాస్తవాలు బయటపెట్టి మాట్లాడే ధైర్యం సజ్జలకు ఉందా? అని ప్రశ్నించారు.

Updated Date - 2021-09-02T21:29:26+05:30 IST