Tirumala కు వచ్చే భక్తుల కోసం ప్రతి అరగంటకో బస్సు
ABN , First Publish Date - 2021-08-25T12:18:52+05:30 IST
Tirumala కు వచ్చే భక్తుల కోసం ప్రతి అరగంటకో బస్సు

తిరుమల : తమిళనాడు నుంచి తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనార్థం వచ్చే భక్తుల సౌకర్యార్థం ప్రతి అరగంటకో బస్సును ఏర్పాటు చేశామని తిరుమల ఆర్టీసీ డీఎం ఎంవీఆర్ రెడ్డి మంగళవారం తెలిపారు. కొవిడ్ సెకండ్ వేవ్ తర్వాత చెన్నై, వేలూరుకు 30 నిమిషాలకు ఒకసారి.. అలాగే, విమానాశ్రయం, హోసూరుకు కొన్ని బస్సు సర్వీసులను అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు.