‘ఉక్కు’పై మాట్లాడొద్దు!
ABN , First Publish Date - 2021-02-06T08:36:04+05:30 IST
వైసీపీ ఎంపీలు శుక్రవారం ఢిల్లీలో విలేకరుల ముందుకువచ్చారు. ఒకరి తర్వాత ఒకరు మాట్లాడారు.

జగన్ స్టాండ్ తీసుకుంటారు: వైసీపీ ఎంపీల గుసగుస
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 5(ఆంధ్రజ్యోతి): వైసీపీ ఎంపీలు శుక్రవారం ఢిల్లీలో విలేకరుల ముందుకువచ్చారు. ఒకరి తర్వాత ఒకరు మాట్లాడారు. రాజ్యసభ సభ్యుడు పిల్లి సు భాష్ వంతు వచ్చాక... ‘విజయసాయి రెడ్డి గారు విశాఖ ఉక్కు అంశంపై మాట్లాడమన్నారు’... అని పక్కనే ఉన్న ఎంపీ బాలశౌరితో గుసగుసలాడారు. ‘‘కాదు... దానిపై పార్టీ స్టాండ్ తీసుకుంటుంది.. దానిపై మాట్లాడవద్దని చెప్పారే! ఇప్పుడే వద్దు, సీఎం గారు ఒక వైఖరి తీసుకుంటారని చెప్పారు’’ అని బాలశౌరి బదులిచ్చారు. ‘మరి ఇప్పుడు ఏం చెప్పమంటారు’ అని పిల్లి సుభాష్ మరోసారి అడగ్గా... ‘చెప్పండి. మామూలువి ఉంటాయి కదా! చంద్రబాబునాయుడు అవి..’ అని బాలశౌరి సూచించారు. వీరి మధ్య అంతా గుసగుసలు సాగినప్పటికీ... మైక్‌లు ఆన్‌లో ఉండటంతో వారి మాటలు అందరికీ వినిపించాయి. ఆ తర్వాత బాలశౌరి ఏపీ భవన్‌లోమాట్లాడుతూ.. ‘స్టీల్‌ప్లాంట్ విషయంలో నా మాటలను వక్రీకరించారు. ముఖ్యమంత్రిని అడిగి మాట్లాడతామనడంలో తప్పేముంది?’ అని ప్రశ్నించారు. కాగా, ఏపీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ రాజ్యాంగ వ్యతిరేక శక్తిగా మారారని వైసీపీ ఎంపీలు పిల్లి సుభాశ్ చంద్రబోస్, వల్లభనేని బాలశౌరిలు ఆగ్రహం వ్యక్తం చేశారు.