తాడిపత్రిలో ఉద్రిక్తత.. కేతిరెడ్డి వర్సెస్ రమేష్‌రెడ్డి

ABN , First Publish Date - 2021-07-12T22:05:18+05:30 IST

దీంతో కేతిరెడ్డి అనుచరులు రమేష్‌రెడ్డిపైకి వాగ్వాదానికి వెళ్లారు. దీంతో ఉద్రిక్త పరిస్తితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతంలో భారీగా పోలీసులు మోహరించారు.

తాడిపత్రిలో ఉద్రిక్తత.. కేతిరెడ్డి వర్సెస్ రమేష్‌రెడ్డి

అనంతపురం: అక్రమ నిర్మాణాలంటూ తాడిపత్రి మండలం గన్నెవారిపల్లిలోని ఆర్డీటీ కాలనీలో కొత్తగా నిర్మించిన ఇళ్లను ఎమ్మెల్యే కేతిరెడ్డి కూల్చివేయించారు. అయితే ఇళ్లు కోల్పోతున్న బాధితులకు వైసీపీ రాష్ట్ర కార్యదర్శి కొణిదెల రమేష్‌రెడ్డి అండగా నిలుచున్నారు. ఇళ్ల నిర్మాణం పూర్తయ్యాక కూల్చివేతలేంటని రమేష్‌రెడ్డి నిలదీశారు. దీంతో కేతిరెడ్డి అనుచరులు రమేష్‌రెడ్డిపైకి వాగ్వాదానికి వెళ్లారు. దీంతో ఉద్రిక్త పరిస్తితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతంలో భారీగా పోలీసులు మోహరించారు.

Updated Date - 2021-07-12T22:05:18+05:30 IST