తాలిబన్లతో ‘తాడేపల్లి’ బంధం

ABN , First Publish Date - 2021-10-07T08:47:32+05:30 IST

తాలిబన్లతో వైసీపీ నేతలు సంబంధాలు పెట్టుకొని డ్రగ్స్‌ వ్యాపారం చేస్తున్నారు. వాటిని అన్నింటినీ బయట పెడతాం.

తాలిబన్లతో ‘తాడేపల్లి’ బంధం

  • వైసీపీ నేతలు డ్రగ్స్‌ వ్యాపారం చేస్తున్నారు.. అన్నీ బయటపెడతాం
  • మాఫియా దాడులకు బెదిరే ప్రసక్తి లేదు.. రాష్ట్రంలో సైకో పాలన
  • ఇంత అప్రతిష్టపాలైన ప్రభుత్వం దేశ చరిత్రలో లేదు
  • అయినకాడికి అప్పులు.. అడుగడుగునా ప్రజలపై బాదుడు: చంద్రబాబు
  • షిప్పుల్లో పీడీఎస్‌ బియ్యం ఎగుమతి.. తిరిగొచ్చేటప్పుడు డ్రగ్స్‌ దిగుమతి
  • వైసీపీ నేతలు రాష్ట్రాన్ని డ్రగ్స్‌ కేంద్రంగా మార్చేశారు: పట్టాభి


‘‘తాలిబన్లతో వైసీపీ నేతలు సంబంధాలు పెట్టుకొని డ్రగ్స్‌ వ్యాపారం చేస్తున్నారు. వాటిని అన్నింటినీ బయట పెడతాం. డ్రగ్స్‌ మాఫియా దాడులకు బెదిరే ప్రసక్తి లేదు. ఆ మాఫియా నాయకుడైన వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి తన మూకలతో దాడులకు తెగబడటం ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు. ప్రతిపక్ష పార్టీ కార్యాలయంపై డ్రగ్స్‌ మాఫియా దాడికి దిగితే పోలీసు యంత్రాంగం నిద్రపోతోం దా?’’ అని చంద్రబాబు మండిపడ్డారు. డ్రగ్స్‌ వ్యవహారంలో తన పాత్ర బయటపడుతుందన్న భయంతోనే ద్వారంపూడి దాడులకు తెగబడ్డారన్నారు. ఈ తాటాకు చప్పుళ్లకు భయపడే ప్రసక్తి లేదని వ్యాఖ్యానించారు. దాడికి దిగిన మాఫియా మూకలను తక్షణం అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు. టీడీపీ నాయకులకు ఏ హాని జరిగినా ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి, డీజీపీ, పోలీస్‌ యంత్రాంగం బాధ్యత వహించాల్సి ఉంటుందని చంద్రబాబు స్పష్టం చేశారు. 

Updated Date - 2021-10-07T08:47:32+05:30 IST