ఇళ్ల లబ్ధిదారుల ఆప్షన్‌ను తొలగించడం ఏంటి?: సయ్యద్‌ రఫీ

ABN , First Publish Date - 2021-08-27T08:24:32+05:30 IST

ఇళ్ల నిర్మాణానికి మూడు ఆప్షన్లు ఇచ్చిన ప్రభుత్వం.. లబ్దిదారులు ఎంచుకున్న ఆప్షన్‌ను తొలగించడం ఏమిటి? అని టీడీపీ అధికార ప్రతినిధి సయ్యద్‌ రఫీ నిలదీశారు.

ఇళ్ల లబ్ధిదారుల ఆప్షన్‌ను   తొలగించడం ఏంటి?: సయ్యద్‌ రఫీ

అమరావతి, ఆగస్టు 26(ఆంధ్రజ్యోతి):ఇళ్ల నిర్మాణానికి మూడు ఆప్షన్లు ఇచ్చిన ప్రభుత్వం.. లబ్దిదారులు ఎంచుకున్న ఆప్షన్‌ను తొలగించడం ఏమిటి? అని టీడీపీ అధికార ప్రతినిధి సయ్యద్‌ రఫీ నిలదీశారు. గురువారం టీడీపీ జాతీయ కార్యాలయంలో  మాట్లాడిన ఆయన.. సెంటు పట్టా స్థలాల పంపిణీలో రూ.6,500 కోట్ల కుంభకోణానికి పాల్పడిన జగన్‌ సర్కారు.. లబ్ధిదారులే సొంత సొమ్ముతో ఇళ్లు కట్టుకోవాలని చెప్పడం పేదల్ని మోసం చేయడం కాదా? అని ప్రశ్నించారు. 

Updated Date - 2021-08-27T08:24:32+05:30 IST