ఆర్కేపై జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేయడం సిగ్గుచేటు: శ్యామ్ చంద్ర శేషు

ABN , First Publish Date - 2021-12-13T18:10:21+05:30 IST

అవినీతిని పసిగట్టి, జరుగుతున్న అన్యాయాలను ప్రజలకు తెలియజేయాల్సిన ఏపీ సీఐడీ.. వైసీపీ ప్రభుత్వ అక్రమాలను బయటపెడుతున్న ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణపై..

ఆర్కేపై జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేయడం సిగ్గుచేటు: శ్యామ్ చంద్ర శేషు

అమరావతి: అవినీతిని పసిగట్టి, జరుగుతున్న అన్యాయాలను ప్రజలకు తెలియజేయాల్సిన ఏపీ సీఐడీ.. వైసీపీ ప్రభుత్వ అక్రమాలను బయటపెడుతున్న ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణపై జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేయడం సిగ్గుచేటని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి దాసరి శ్యామ్ చంద్ర శేషు పేర్కొన్నారు. నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఏపీ సీఐడీ తన స్వతంత్రను దుర్వినియోగం చేస్తూ వైసీపీ కోసం పనిచేస్తోందన్నారు. ఏపీ సీఐడీ అధికారులు ఉండగానే లక్ష్మీ నారాయణ దగ్గరకు రాధాకృష్ణ వెళ్ళారన్నారు. అప్పుడు అడ్డుచెప్పని సీఐడీ అధికారులు 36గంటల తరువాత సీఎం జగన్ రెడ్డి ఆదేశాలతో కేసును నమోదు చేయడం అప్రజాస్వామిక చర్యగా శ్యామ్ చంద్ర శేషు అభివర్ణించారు. 


Updated Date - 2021-12-13T18:10:21+05:30 IST