మావోయిస్టు సభ్యుడు, మిలీషియా సభ్యుల లొంగుబాటు

ABN , First Publish Date - 2021-03-21T09:32:01+05:30 IST

మావోయిస్టు సభ్యుడు, మిలీషియా సభ్యుల లొంగుబాటు

మావోయిస్టు సభ్యుడు, మిలీషియా సభ్యుల లొంగుబాటు

విశాఖపట్నం, మార్చి 20 (ఆంధ్రజ్యోతి): మావోయిస్టు పార్టీ పెదబయలు దళ సభ్యుడు పాంగి జగ్గారావు, మరో ఇద్దరు మిలీషియా సభ్యులు పాంగి ముగిరి, వంతల నారాయణ జిల్లా ఎస్పీ బొడ్డేపల్లి కృష్ణారావు ఎదుట శనివారం లొంగిపోయారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో లొంగిపోయిన ముగ్గురి వివరాలను ఆయన వెల్లడించారు. పెదబయలు మండలం జుమడాం గ్రామానికి చెందిన జగ్గారావు 2006లో మావోయిస్టు బాలల సంఘంలో చేరి క్రమేణా పార్టీ సభ్యుడిగా మారాడు. ఇదే గ్రామానికి చెందిన ముగిరి 2008 నుంచి మిలీషియా సభ్యుడిగా పనిచేసి ప్రస్తుతం జననాట్య మండలి కమాండర్‌గా కొనసాగుతున్నాడు. నారాయణ 2010 నుంచి మిలీషియా సభ్యుడిగా కొనసాగుతున్నాడు. 

Updated Date - 2021-03-21T09:32:01+05:30 IST