బొప్పరాజు ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు: సురేష్

ABN , First Publish Date - 2021-03-21T21:01:42+05:30 IST

వీఆర్వోలకి 50 శాతం ప్రమోషన్స్‌లో కేటాయించాలని వీఆర్వో సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సురేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

బొప్పరాజు ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు: సురేష్

విజయవాడ: వీఆర్వోలకి 50శాతం ప్రమోషన్స్‌లో కేటాయించాలని వీఆర్వో సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సురేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వీఆర్వోల్లో డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్న వారు 54 శాతం మంది ఉన్నారన్నారు. అందుకే 50 శాతానికి తాము అంగీకరించామని చెప్పారు. ఏడేళ్ల నుంచి తాము ప్రమోషన్స్ కోసం కృషి చేస్తున్నామని తెలిపారు. గతంలో ప్రమోషన్స్ అడ్డుకున్న ఏపీ ఉద్యోగుల జేఏసీ ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు ఇప్పుడు మద్దతు తెలుపుతుంటే ఎందుకు ఇబ్బంది పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం పదోన్నతి కోసం బొప్పరాజుతో ఒప్పందం చేసుకోలేదని చెప్పారు. వీఆర్వోలు ఎదురుకుంటున్న పలు సమస్యలపై తాము చర్చించామని వ్యాఖ్యానించారు. స్వార్థ ప్రయోజనాల కోసం సంఘాన్ని చీల్చాలని చూడడం సరికాదని సురేష్ పేర్కొన్నారు.

Updated Date - 2021-03-21T21:01:42+05:30 IST